Home  »  Bollywood News  »  Dhurandhar 2: 'ధురంధర్ 2' ట్రైలర్ రెస్పాన్స్.. నెట్ ఫ్లిక్స్ ఎందుకు తప్పుకుంది.. పవర్ స్టార్ షాకిస్తాడా?

Updated : Mar 10, 2026

  • 'ధురంధర్ 2' ట్రైలర్ సంచలన రికార్డు
  • 48 గంటల్లో 312 మిలియన్ల వ్యూస్
  • ఓటీటీ ప్లాట్ ఫామ్ ఎందుకు మారింది?
  • తెలుగునాట 'ధురంధర్ 2' ప్రభావం ఉంటుందా?

పాన్ ఇండియా వైడ్ గా ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా 'ధురంధర్ 2'. గతేడాది డిసెంబర్ 5న ఒక్క హిందీ భాషలోనే విడుదలైన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్.. వరల్డ్ వైడ్ గా దాదాపు రూ.1400 కోట్ల గ్రాస్ రాబట్టి సర్ ప్రైజ్ చేసింది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా 'ధురంధర్ ది రివెంజ్' వస్తోంది. (Dhurandhar: The Revenge)

'ధురంధర్ 2' ఈ మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో కూడా విడుదల కానుంది. మొదటి భాగం కేవలం హిందీ భాషలో విడుదలైతేనే రూ.1400 కోట్లు వసూలు చేసిందంటే.. ఇక ఇప్పుడు రెండో భాగం పాన్ ఇండియా భాషల్లో విడుదలవుతుండటంతో పాజిటివ్ టాక్ వస్తే ఏ రేంజ్ వసూళ్లు వస్తాయి అనేది ఊహకు కూడా అందదు. 

ప్రస్తుతం 'ధురంధర్ 2'పై హైప్ ఏ రేంజ్ లో ఉందో చెప్పడానికి ట్రైలర్ కి వస్తున్న రెస్పాన్స్ ని ఉదాహరణగా చెప్పవచ్చు. మార్చి 7న ఈ మూవీ ట్రైలర్ విడుదల కాగా, కేవలం 48 గంటల్లోనే 312 మిలియన్ల వ్యూస్ తో రికార్డు సృష్టించింది. అంతేకాదు 45 కి పైగా దేశాలలో యూట్యూబ్ చార్ట్స్ లో ట్రెండింగ్‌లో ఉంది.

'ధురంధర్ 2' ఓటీటీ డీల్ కూడా హాట్ టాపిక్ గా మారింది. మొదటి భాగం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుండగా, రెండో భాగం ఓటీటీ రైట్స్ మాత్రం జియో హాట్ స్టార్ చేతికి వెళ్లాయి. ట్రైలర్ లో ఈ విషయాన్ని రివీల్ చేశారు.

చిత్ర నిర్మాణంలో జియో స్టూడియోస్ భాగస్వామిగా ఉంది. పైగా ఓటీటీ రైట్స్ కోసం నెట్ ఫ్లిక్స్ ని మించి భారీ మొత్తం చెల్లించడానికి జియో హాట్ స్టార్ రెడీ అయినట్లు తెలుస్తోంది. అందుకే ఓటీటీ ప్లాట్ ఫామ్ మారినట్లు సమాచారం.

ఈ చిత్రంలో రణవీర్ సింగ్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నాడు. జస్కిరత్ సింగ్ రంగీ, హమ్జా అలీ మజారి అనే రెండు విభిన్న పాత్రల్లో కనువిందు చేయనున్నాడు. ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. 

జియో స్టూడియోస్ సమర్పణలో B62 స్టూడియోస్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ఆదిత్య ధర్ దర్శకుడు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం మార్చి 19న థియేటర్లలోకి రాబోతుంది.

కాగా, మార్చి 19న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) కూడా విడుదలవుతోంది. పవన్ కళ్యాణ్ సినిమా అంటే తెలుగునాట ఎంతటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. దాంతో పవర్ స్టార్ మూవీకి పోటీగా అదే రోజు విడుదలవుతున్న 'ధురంధర్ 2' తెలుగునాట ఏ మేరకు ప్రభావం చూపుతుంది అనేది ఆసక్తికరంగా మారింది.

Also Read: లంచగొండిని లైవ్ లో హత్య చేసిన భారతీయుడు!






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.